నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎడ తేరిపి లేకుండా వర్షం కురుస్తోంది. నెల్లూరు జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షానికి ఆర్టీసీ కాలనీ, భగత్ సింగ్ కాలనీ, చంద్రబాబుకాలనీ, మాగుంటలేఅవుట్, ఎన్టీఆర్ నగర్ ప్రాంతాలు నీటమునిగాయి. రవీంద్రనగర్, బుచ్చిరెడ్డిపాలెంలో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు జిల్లాలోని వర్షం పరిస్థితులపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షం - నెల్లూరు జిల్లాలో వర్షాలు
నెల్లూరు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
heavy rain
Last Updated : Nov 12, 2020, 1:56 PM IST