ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సినీఫక్కిలో భారీగా గంజాయి పట్టివేత - marijuana smuggling news nellore district

పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లిలో ఆదివారం సినీ ఫక్కీలో 268 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

heavy-marijuana-smuggling-in-nellore-distric
సినీఫక్కిలో భారీగా గంజాయి పట్టివేత

By

Published : Jul 12, 2020, 10:16 PM IST

పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లిలో ఆదివారం సినీ ఫక్కీలో 268 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖ జిల్లా సీలేరు నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న సమాచారంతో జీలుగుమిల్లి ఎస్సై విశ్వనాథబాబు తన సిబ్బందితో లక్ష్మీపురం వద్ద గస్తీ నిర్వహించారు. గంజాయి తరలిస్తున్న ట్రావెల్స్ బస్సును అడ్డుకోగా బస్సును ఆపకుండా వెళ్లిపోయారు. ఎస్సై తన వాహనంతో 10 కిలోమీటర్లు వెంబడించి బస్సును పట్టుకున్నారు. బస్సులో ప్రత్యేకంగా అమర్చిన 268 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని మహారాష్ట్రకు చెందిన సోమేశ్వర్, సిద్దేశ్వర్, ప్రదీప్​లను అరెస్ట్ చేశారు.

ఇదీ చదవండి: చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

ABOUT THE AUTHOR

...view details