నెల్లూరులో అక్రమ మద్యం భారీగా పట్టుబడుతోంది. నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో... స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన 2,860 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ నాలుగు లక్షల రూపాయలపైనే ఉంటుందని పోలీసులు చెప్పారు. ఈ కేసుతో సంబంధమున్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. మద్యం అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నెల్లూరులో భారీగా కర్ణాటక మద్యం పట్టివేత - news updates in nellore
రాష్ట్రంలో మద్యం అక్రమ రవాణాకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ... అక్రమ తరలింపు ఆగడం లేదు. తాజాగా నెల్లూరులో ఎస్ఈబీ అధికారులు జరిపిన దాడుల్లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యం భారీగా పట్టుబడింది.
నెల్లూరులో భారీగా కర్ణాటక మద్యం పట్టివేత