నెల్లూరు జిల్లాలో మర్రిపాడు, అనంతసాగరం మండలాల్లో ఒక్కసారిగా తీవ్ర గాలి, వర్షం కురిసిన కారణంగా.. అప్పటికే కోతకు వచ్చిన పంటలను రైతులు నష్టపోయారు. మర్రిపాడు, పి.నాయిడు పల్లి, కదిరినాయుడు పల్లి గ్రామాల్లో వందల ఎకరాల్లో బొప్పాయి చెట్లు విరిగిపోయాయి.
చుంచులూరు, కొత్తపల్లి గ్రామాల్లో అంతర పంటగా వేసిన వెరుశెనగ.. నీట మునిగిపోయింది. అనంతసాగరం మండలం అగ్రహరం, బొమ్మవరం, చాపురాళ్ళపల్లి, వడ్డిపల్లి గ్రామాల్లో మిర్చి పంట కొట్టుకుపోయింది. గాలి వాన ధాటికి ఇళ్లు పడిపోగా.. అగ్రహరం గ్రామంలో గోడ కూలి 5 మేకలు చనిపోయాయి. విద్యుత్ సరఫరాకూ ఆటంకం కలిగింది. స్తంభాలు కూలిన కారణంగా.. 2 గ్రామాల్లో అంధకారం నెలకొంది.