Harassment of women : నెల్లూరు జిల్లా రాపూరు మండల ఎంపీపీ కుమ్మరగుంట ప్రసన్న, జెడ్పీటీసీ చిగురుపాటి ప్రసన్నలను దళిత మహిళలమని తమను వైసీపీ నాయకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం పై రెండురోజుల కిందట జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ను కలిసి వినతిపత్రం ఇచ్చామని వెల్లడించారు. తమ సమస్యను మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి, జెడ్పీ చైర్ పర్సన్ క దృష్టికి తీసుకెళ్లారు. తమ కార్యాలయ వాష్‌రూంకు తాళం వేయడం..తమను ఇబ్బందులకు గురిచేయడమేనని వారు మంత్రికి ఇచ్చిన వినతిపత్రంలో తమ ఆవేదనను వెల్లడించారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
అసలు ఏమైందంటే..రాపూరు మండల ఎంపీపీగా ఉన్న చిన్న బాలకృష్ణా రెడ్డి ఇటీవల మరణించడంతో.. వైస్ ఎంపీపీగా ఉన్నకుమ్మరగుంట ప్రసన్నని ఈ నెల 11న రాపూరు మండలానికి ఎంపీపీగా ఎన్నుకున్నట్లు వారు చెప్పారు. కాగా మరుసటి రోజు 12వ తేదీన మండల పరిషత్ కార్యాలయానికి రాగా ఆమెకు కేటాయించిన వసతి గృహంలో ఉన్న వాష్ రూమ్ (బాత్ రూమ్) కు తాళాలు వేశారు. తాళాలు వేసి పది రోజులైనా తీయకుండా మహిళలైన తమను దారుణంగా వేధిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఇదే విధంగా కార్యాలయంలో జరిగే కార్యక్రమాలకు, సమావేశాల గురించి తమకు సమాచారం ఇవ్వడంలేదని జెడ్పీటీసీ చిగురుపాటి ప్రసన్న ఆరోపించారు. దళితులమని చులకన భావంతోనే ఇదంతా చేస్తున్నారని తెలిపారు. తమ ఇబ్బందిపై జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మకు తమ సమస్యను పరిశీలన చేసి, పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు.
ఈ తతంగం అంతా వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జిగా ఉన్న నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అండదండలతో ఈ జరుగుతోందని వారు ఆరోపించారు. మహిళలను గౌరవించాలని చెబుతూనే, మరోవైపు ఎస్సీ మహిళను అగౌరపరుస్తూ తాళాలు వేయడం అనేది అధికారులను సైతం ఇబ్బందిగా మారింది. తమకున్న హోదాను బట్టి కనీస అవసరాలతో పాటు గౌరవ మర్యాదలు కాపాడటంలో అధికార పార్టీ నేతలు సహకారం అందించాలని వారు కోరుతున్నారు.
ఈ నెల 11న రాపూరు మండల ఎంపీపీగా నన్ను ఎన్నుకన్నారు అనంతరం 12వ తేదీన మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లగా..అక్కడున్న వాష్ రూమ్ (బాత్ రూమ్) కు తాళాలు వేశారు. దీనిపై అక్కడున్న అధికారులని ప్రశ్నించగా ఎవరూ స్పందించలేదు. దీనిపై జిల్లా కలెక్టర్ కి ఆర్జీ పెట్టినా స్పందనలేదు. కేవలం దళిత మహిళలని చులకనా భావంతో ఇదంతా రామ్ కుమార్ రెడ్డి చేయిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌కి వినతిపత్రం ఇచ్చాము. - కుమ్మరగుంట ప్రసన్న రాపూరు ఎంపీపీ.