ముఖ్యమంత్రి జగన్ కొత్త టీమ్ రెడీ అయ్యింది. రెండు రోజుల నుంచి కసరత్తు చేసిన ముఖ్యమంత్రి.. మంత్రుల పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ జాబితాను కాసేపట్లో గవర్నర్‌కు పంపించనున్నారు. ఇదిలావుంటే.. నెల్లూరులోని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డి ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. మంత్రుల జాబితాలో కాకాని పేరు ఉందనే సమాచారంతో.. అభిమానులు బొకేలు, స్వీట్లతో ఆయన ఇంటికి తరలి వచ్చారు. కాసేపట్లో కాకాని గోవర్ధన్ రెడ్డికి.. స్వయంగా ముఖ్యమంత్రితో పాటు సీఎంవో కార్యాలయం నుంచి సమాచారం వస్తుందని వేచి చూస్తున్నారు.
MLA Kakani Govardhan reddy: ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద సందడి - ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద సందడి వార్తలు
ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద సందడి
12:50 April 10
ఎమ్మెల్యే నివాసానికి చేరుకుంటున్న నాయకులు
Last Updated : Apr 10, 2022, 2:07 PM IST