వైఎస్సార్ నేతన్న నేస్తంలో పేర్ల తొలగింపుని నిరసిస్తూ నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని చెన్నూరులో చేనేత సంఘం నాయకులు నిరసన చేశారు. గతేడాది చెన్నూరు గ్రామంలో 280 మందికి వైఎస్సార్ నేతన్న నేస్తం పథకంలో లబ్ధి పొందారు. కానీ ఈ ఏడాది 150 మందిని మాత్రమే ఎంపిక చేసి మిగతా వారి పేర్లు తొలగించారని చేనేత సంక్షేమ సంఘం నాయకులు శ్రీనివాసులు అన్నారు. లబ్ధిదారులందరికీ ఆర్థిక సాయం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
నేతన్న నేస్తంలో పేర్ల తొలగింపు.. గూడూరులో చేనేత కార్మికుల నిరసన - nellore dst handloom workers protest
వైఎస్సార్ నేతన్న నేస్తంలో గత సంవత్సరం లబ్ధిపొందినవారందరికీ ఈ ఏడాది కూడా సహాయం అందించాలని చేనేత సంక్షేమ సంఘం నాయకులు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని చెన్నూరులో సచివాలయం వద్ద చేనేతలు నిరసన తెలిపారు.
![నేతన్న నేస్తంలో పేర్ల తొలగింపు.. గూడూరులో చేనేత కార్మికుల నిరసన handloom workers protest in nellore dst gudur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7821938-865-7821938-1593437929521.jpg)
handloom workers protest in nellore dst gudur