సాధారణంగానే చేనేత మగ్గాలు అతికష్టం మీద నడుస్తాయి. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి చేనేత కార్మికులది. గోరుచుట్టపై రోకలి పోటులా నేతన్నల జీవితాలపై లాక్డౌన్ తీవ్ర దెబ్బకొట్టింది. కరోనాతో ఇళ్లకే పరిమితమైన నేత కళాకారుల జీవనం దుర్భరంగా మారింది. చేనేత వెతలపై నెల్లూరు జిల్లా నుంచి మా ప్రతినిధి రాజారావు అందిస్తున్న కథనం..!
మూలకు చేరిన మగ్గం... నేతన్న బతుకు భారం..! - hand loom sector problems in nellore due to corona
లాక్డౌన్ నేపథ్యంలో చేనేత కార్మికుల వెతలు అన్నీ ఇన్నీ కావు. పని లేక పూట గడవని పరిస్థితి నెలకొందని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో చేనేతను నమ్ముకున్న దాదాపు 30 వేల కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని నేతన్నలు దీనంగా వేడుకుంటున్నారు.
మూలకు చేరిన మగ్గం.. నేతన్న బతుకు భారం..!
TAGGED:
lock down in nellore