నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో గుట్కా వ్యాపారులను గుర్తించిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ భవాని శ్రీహర్ష వెల్లడించారు. తొలత 43 వేలు విలువచేసే గుట్కా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిపారు. అతనికి సరుకు చేరవేస్తున్న చిత్తూరు జిల్లా తొట్టంబేడు వ్యాపారి ఒకరిని గుర్తించి విచారణ చేశామన్నారు.
అతని వద్ద లక్ష ముప్పై నాలుగు రూపాయలు విలువచేసే గుట్కాలను, 5.34 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఈ అక్రమాలను గుర్తించిన సీఐ అన్వర్ భాాషా, ఎస్సై వెంకట రాజేష్ ను డీఎస్పీ అభినందించారు.