నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన 1.07 లక్షల రూపాయలు విలువ చేసే గుట్కా, ఖైనీలను పోలీసులు పట్టుకున్నారు. ఎన్టీఆర్ నగర్‌కి చెందిన వెంకట రామారావు గుట్కాలు, ఖైనీలు విక్రయిస్తున్నాడనే పక్కా సమాచారంతో పోలీసుకు దాడులు నిర్వహించారు. నిందితుడు గతంలోనూ గుట్కా కేసులో ముద్దాయిగా ఉన్నట్లు బాలాజీనగర్ సీఐ సోమయ్య తెలిపారు. గుట్కా రవాణాపై పూర్తిస్థాయిలో విచారించి మరికొందరిని అరెస్టు చేస్తామన్నారు.
రూ.1.07 లక్షల విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్ల స్వాధీనం - LATEST nellore news
నిషేధిత గుట్కాల విక్రయంపై నెల్లూరు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలో అక్రమంగా నిల్వ ఉంచిన 1.07 లక్షల రూపాయలు విలువ చేసే గుట్కా, ఖైనీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Breaking News