Guntur and Kandukur stampede incidents Extension of inquiry: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కందుకూరు ప్రాంతాల్లో జరిగిన తొక్కిసలాట ఘటనలకు సంబంధించి.. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.శేషశయనారెడ్డి నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిషన్.. తొక్కిసలాటల ఘటనలకు దారితీసిన పరిస్థితులేంటి?, వాటికి బాధ్యులెవరు?, ఏర్పాట్లలో లోపాలేమైనా ఉన్నాయా?, అనుమతుల ఉల్లంఘన జరిగిందా?, జరిగితే దానికి బాధ్యులెవరు? అన్న అంశాలపై విచారణను ప్రారంభించింది.
ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు సంబంధించి ఈరోజు కీలక ఉత్తర్వులను జారీ చేసింది. విచారణ గడువును మరో నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్లు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2023 మార్చి 17వ తేదీ వరకూ విచారణ కమిషన్ గడువును పొడిగించారు. మార్చి 17 తేదీన లేదా అంతకు ముందుగా గుంటూరు- కందుకూరు తొక్కిసలాట ఘటనలపై నివేదిక ఇవ్వాలంటూ విచారణ కమిషన్‌కు ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.