ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ రహదారిపై ప్రయాణం..నరకానికి ప్రతిరూపం - gundur- yerpedu main road latest news

అది రాష్ట్ర ప్రధాన రహదారి. నిత్యం ఎన్నో వాహనాలు దాని మీదుగా ప్రయాణిస్తుంటాయి. అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల మేర కంకర తేలిన ఆ రహదారిపై వెళ్లాలంటేనే భయపడుతున్నారు.

Gudur-yerpedu state highway
Gudur-yerpedu state highway

By

Published : Sep 18, 2020, 7:09 PM IST

నెల్లూరు జిల్లాలోని గూడూరు-ఏర్పేడు రాష్ట్ర రహదారి అస్తవ్యస్తంగా మారింది. 20 కిలోమీటర్లు కంకర తేలి పెద్ద గోతులతో దర్శనమిస్తోంది. ఏళ్లుగా కనీస మరమ్మతులకు నోచుకోకపోవటంతో... ఈ రహదారి ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. గోతుల్లో వాహనాలు పడిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనివల్ల ఎన్నో ప్రాణాలు బలవుతున్నాయి. ఇక రాత్రి వేళ ఈ రహదారిపై ప్రయాణించాలంటేనే వాహనదారులు హడలెత్తిపోతున్నారు. వర్షాకాలంలో అయితే వారి కష్టాలు వర్ణనాతీతం. ఆ రోడ్డు పరిస్థితిపై మా ప్రతినిధి రాజారావు పూర్తి వివరాలు అందిస్తారు.

నరకానికి ప్రతిరూపం... ఆ రహదారిపై ప్రయాణం

ABOUT THE AUTHOR

...view details