నెల్లూరు జిల్లా ఉదయగిరిలో భాజపా యువ నాయకులు సురేష్ రెడ్డి, సునీల్ రెడ్డి, విజయ్ రెడ్డి మిత్రబృందం సొంత నిధులు వెచ్చించి సమకూర్చిన బియ్యం, కూరగాయలను పారిశుద్ధ్య కార్మికులకు పంపిణీ చేశారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలోని వైద్య సిబ్బందికి కూరగాయల ప్యాకెట్లను అందించారు.
భాజపా ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు సరకుల పంపిణీ
భాజపా ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బందికి బియ్యం, కూరగాయలను పంపిణీ చేశారు.
grossaries distirbutes to santiation workers in nellore dst udhayagiri under bjp leaders
పోలీసులకు మాస్కులు, శానిటైజర్లను అందజేశారు. ప్రతి భాజపా కార్యకర్త కనీసం ఐదు మంది పేదలకు సహాయం చేయాలని పిలుపునివ్వడంతో తమవంతుగా కూరగాయలు, బియ్యం పంపిణీ చేసినట్లు భాజపా యువ నాయకులు తెలిపారు. రాష్ట్ర, జిల్లా నాయకులు పరంధామరెడ్డి, మల్యాద్రి, రోశయ్య, బాలకృష్ణారెడ్డి పాల్గొని బియ్యం కూరగాయలను అందించారు.