నెల్లూరు జిల్లాలో దాదాపు 10 వేల ఎకరాలలో పచ్చిమిర్చి సాగు చేస్తారు. ప్రధానంగా అనంతసాగరం, మర్రిపాడు మండలాల రైతులు అధికంగా మిర్చిని పండిస్తారు. కానీ ఈ ఏడాది పచ్చిమిర్చి ధరలు సరిగా లేకపోవడంతో రైతులు పూర్తిగా నష్టపోయారు. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర తగ్గిపోవడంతో కూలీల ఖర్చు కూడా రావడం లేదని, పెట్టుబడుల కోసం ప్రైవేటు వ్యాపారుల దగ్గర తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదని రైతులు వాపోతున్నారు.
పచ్చిమిర్చి ధరలు పడిపోవడంతో సరకును పండుమిర్చిగా మార్చుకుని విక్రయించుకుందామన్నా రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. గుంటూరు మార్కెట్ యార్డ్ లో క్వింటా ఎండుమిర్చిని రూ.ఎనిమిది వేలకే అడుగుతున్నారని రైతులు చెబుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.