ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒకే ఉరితాడు.. జంట ఆత్మహత్య! - padarupalli lovers suicide news

వారిద్దరూ సచివాలయ ఉద్యోగులు. గతంలో ప్రేమించుకున్నారు. కాలం కలిసి రాక.. వేరే వారితో వివాహం జరిగింది. అలా బతకలేకపోయారు. చివరికి ఒకే చున్నీకి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన.. నెల్లూరులో జరిగింది.

lovers suicide
లవర్స్ సూసైడ్

By

Published : Jan 30, 2021, 11:12 AM IST

Updated : Jan 30, 2021, 2:48 PM IST

ప్రేమ జంట ఆత్మహత్య

నెల్లూరు నగరంలోని ఓ లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పడారుపల్లి శివార్లలోని ఉన్న లాడ్జిలో ఒకే చున్నీకి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులను హరీష్, లావణ్య అని... చిచ్చముర మండలం మెట్టు సచివాలయంలో వారు ఉద్యోగులని పోలీసులు గుర్తించారు.

లావణ్య... మెట్టు సచివాలయంలో వీఆర్వోగా విధులు నిర్వర్తించగా.. హరీష్ ఇంజినీరింగ్ అసిస్టెంట్​గా పని చేశారు. వీరిద్దరూ ప్రేమించుకున్నా.. ఇరువురికీ ఇటీవలే వేరే వారితో వివాహాలు చేసుకున్నారని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. మనస్తాపానికి గురై.. ఒకే చున్నీకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.

Last Updated : Jan 30, 2021, 2:48 PM IST

ABOUT THE AUTHOR

...view details