ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీ రంగనాథ స్వామి రథోత్సవాన్ని ప్రారంభించడం అదృష్టం: కోటంరెడ్డి

Nellore Shree Talpagiri Ranganatha Swami Rathotsavam : నెల్లూరు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. రంగనాథ స్వామి రథోత్సవాన్ని నెల్లూరు గ్రామీణ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామి వారి కళ్యాణం వేడుకగా జరిగింది.

rathotsavam
rathotsavam

By

Published : Mar 9, 2023, 10:39 PM IST

Shree Talpagiri Ranganatha Swami Rathotsavam : నెల్లూరు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. రంగనాథ స్వామి రథోత్సవాన్ని నెల్లూరు గ్రామీణ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామి వారి కళ్యాణం వేడుకగా జరిగింది.

వేలాదిగా తరలివచ్చిన భక్తులు..: కళ్యాణమూర్తి అయిన శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథ స్వామి పట్టు వస్త్రాలు సర్వాభరణాలతో సుందరంగా ముస్తాబై, భారీ రథంపై రంగనాయకులపేట పురవీధుల్లో విహరించారు. ఆలయం వద్దన్న చిత్రకూటం నుంచి నాలుగుకాళ్ల మండపం వరకు రథోత్సవం సాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు అడుగడుగునా స్వామివారికి హారతులిస్తూ, రథంపై ఉప్పు మిరియాలు చల్లుతూ, టెంకాయలు కొట్టి మొక్కలు తీర్చుకున్నారు.

సాంప్రదాయబద్ధంగా ఎదురుకోలు ఉత్సవం..: నాలుగుకాళ్ల మండపం వద్దకు రథం చేరగానే, అప్పటికే అక్కడ వేచి ఉన్న నరసింహకొండ నరసింహస్వామి రంగనాథ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా ఎదురుకోలు ఉత్సవం కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు దాతలు పెద్ద ఎత్తున అన్నదానం కార్యక్రమాలు, ప్రసాదాలు, శీతల పానియాలను భక్తులకు పంపిణీ చేశారు.

ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం గర్వకారణం..: ``నెల్లూరు నగరంలోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి రథోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం గర్వకారణంగా ఉంది’’ అని ఈ సందర్భంగా నెల్లూరు గ్రామీణ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ``నెల్లూరు నగరంలోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి రథోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం గర్వకారణంగా ఉంది. నెల్లూరు జిల్లాకే ప్రసిద్ధి చెందిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ రంగనాధ భక్త మండలి, రాజరాజేశ్వరీ భక్త మండలుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి, రాజరాజేశ్వరీ అమ్మవార్ల ఊరేగింపు భక్తులకు వేడుకగా ఉంటుందన్నారు.

ప్రారంభించే అవకాశం దక్కడం అదృష్టం..: నగర పెద్దలు తనను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వేడుకలను ప్రారంభించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. గత 35 సవత్సరాలుగా శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ రథోత్సవం సందర్భంగా విచ్చేసిన భక్తులు, ఇతరులకు సూమారు 30 వేల మందికి భోజనాలు వడ్డించటం ఆహ్వానించదగిందన్నారు.

నగర ప్రముఖల సహకారం అభినందనీయం..: శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి రథోత్సవ నిర్వహణకు నగర ప్రముఖలు సహకరించడం మంచి పరిణామన్నారు. తనను ఎంతో ప్రేమతో ఆహ్వానించిన పురప్రముఖులకు మరోసారి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని కోటంరెడ్డి ఆకాంక్షించారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మమేకం..: నెల్లూరు గ్రామీణ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవల ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువ అవుతున్నారు. నెల్లూరు నగరంలోని దేవాలయాలలో పూజలు,ఉత్సవాలు ఏటా నిర్వహించే రథోత్సవాల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాలుపంచుకుంటున్నారు. ప్రజలతో మమేకం కావడానికి ఆధ్యాత్మిక వైభవాన్ని నిలబెట్టడానికి నెల్లూరు జిల్లా ప్రాశస్త్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలియ జేయడానికి శాసనసభ్యులుగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉడతాభక్తిగా నైతిక మద్దతు అందిస్తున్నారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details