సీఐటీయూ స్వర్ణోత్సవ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు మహాసభలు జరగనున్నాయి. తొలి రోజు సభకు సీపీఎం జాతీయ నేత బీవీ.రాఘవులు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్, ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రహ్మణ్యం తోపాటు పలువురు నేతలు హాజరయ్యారు. భారీ ప్రదర్శనలో త్రిపురు మాజీ సీఎం మాణిక్ సర్కార్ పాల్గొననున్నారు. తాత్కలిక ఉద్యోగులకు భద్రత కల్పించి కార్మికుల స్థితిగతులు మెరుగుపడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాఘవులు కోరారు. రాష్ట్రంలో వైకాపా, తెదేపాలు తమ స్వప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నాయని విమర్శించారు.
నెల్లూరులో సీఐటీయూ 15వ రాష్ట్ర మహాసభలు - నెల్లూరులో స్వర్ణోత్సవ సీఐటీయు 15వ రాష్ట్ర మహాసభలు
సీఐటీయూ రాష్ట్ర మహా సభలు నెల్లూరులో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవంలో సీపీఎం జాతీయ నేత బీవీ.రాఘవులు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్, ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రహ్మణ్యం తోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
నెల్లూరులో సీఐటీయూ 15వ రాష్ట్ర మహాసభలు
Last Updated : Dec 26, 2019, 2:44 PM IST