నెల్లూరు నగరంలో వాహన తనిఖీలు చేసిన పోలీసులు అక్రమంగా తరలిస్తున్న బంగారం, వెండిని భారీగా పట్టుకున్నారు. తమిళనాడు నుంచి నెల్లూరు వస్తున్న బస్సులో ఈ బంగారం పట్టుబడింది. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న కేజీ బంగారం, 6.50 కేజీల వెండిని అధికారులు సీజ్ చేశారు. ఈ బంగారం, వెండి నెల్లూరుకు చెందిన వ్యాపారిదిగా గుర్తించిన అధికారులు, దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ 60 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వాహన తనిఖీలు: కేజీ బంగారం, 6.50 కేజీల వెండి స్వాధీనం - నెల్లూరులో బంగారం పట్టివేత
ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా తీసుకెళుతున్న కేజీ బంగారం, 6.50 కేజీల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరులో వాహన తనిఖీల్లో పోలీసులు వీటిని గుర్తించారు.
![వాహన తనిఖీలు: కేజీ బంగారం, 6.50 కేజీల వెండి స్వాధీనం gold, silver seized](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9930618-975-9930618-1608350919283.jpg)
gold, silver seized
ఇదీ చదవండి:
Last Updated : Dec 19, 2020, 12:18 PM IST