ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భక్తిశ్రద్ధలతో తూర్పు కనుపూరు ముత్యాలమ్మ జాతర నిర్వహణ - nellore district latest updates

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తూర్పుకనుపూరు శ్రీ ముత్యాలమ్మ జాతర నిర్వహించారు. కరోనా ప్రభావంతో ఉత్సవానికి భక్తులు అంతంతమాత్రమై హాజరయ్యారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను పోలీసుల వెనక్కి పంపించేశారు.

goddess festival in nellore district
తూర్పు కనుపూరు ముత్యాలమ్మ జాతర నిర్వహణ

By

Published : Mar 18, 2020, 11:53 PM IST

తూర్పు కనుపూరు ముత్యాలమ్మ జాతర నిర్వహణ

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తూర్పుకనుపూరు గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ జాతరను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దీనిలో భాగంగా తూర్పు వైపు మిట్ట ప్రాంతంలో ఏర్పాటు చేసిన గుడిసెలో అమ్మవారిని మట్టితో విగ్రహం చేసి సంప్రదాయబద్ధంగా కొలువుదీర్చారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. కరోనా ప్రభావంతో ఆలయంలో భక్తులు లేక ఖాళీగా ఉంది. ఇతర ప్రాంతాల నుంచి జాతరకు వచ్చే భక్తులను సైతం పోలీసులు వెనక్కి పంపించారు. దూరప్రాంత భక్తులెవరూ జాతరకు రావొద్దని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details