నెల్లూరులో గొబ్బెమ్మల పండుగ కోలాహలంగా నిర్వహించారు. గౌరీదేవిగా భావించే గొబ్బెమ్మలకు పూజలు చేసిన మహిళలు, భక్తి శ్రద్ధలతో వాటిని పెన్నానదిలో నిమజ్జనం చేశారు. జిల్లాలోని ప్రసిద్ధ ఆలయంలోని ఉత్సవమూర్తులు ఇక్కడ కొలువుదీరడంతో దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ సందడి చేయగా, యువతీ యువకులు నృత్యాలు చేస్తూ ఉల్లాసంగా గడిపారు. గొబ్బెమ్మల పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నగరం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో నగర పాలక సంస్థ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
పెన్నానది ఒడ్డున వైభవంగా గౌరమ్మ నిమజ్జనోత్సవం - gobbemmala pongal celabrations at nellore district
నెల్లూరులో వైభవంగా గొబ్బెమ్మల పండుగ జరిపారు. గౌరీదేవిగా భావించే గొబ్బెమ్మలకు పూజలు చేసిన మహిళలు, భక్తి శ్రద్ధలతో వాటిని పెన్నానదిలో నిమజ్జనం చేశారు. నగరం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలిరావడంతో నగర పాలక సంస్థ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
పెన్నానది ఒడ్డున వైభవంగా గౌరమ్మ నిమజ్జనోత్సవం