నెల్లూరులో గొబ్బెమ్మల పండుగ ఘనంగా నిర్వహించారు. గౌరి దేవిగా భావించి గొబ్బెమ్మలకు పూజలు చేసిన మహిళలు, పెన్నానదిలో వాటిని నిమజ్జనం చేశారు. కుటుంబ సభ్యులతో కలసి వచ్చి ఆటపాటలతో సందడి చేశారు.
జిల్లాలో ప్రసిద్ధ చెందిన ఆలయాల ఉత్సవ మూర్తులు అక్కడ కొలువుదీరి ఉండగా.. దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ సందడి చేశారు. యువతీ యువకులు నృత్యాలు చేస్తూ ఉల్లాసంగా గడిపారు.