నెల్లూరు జిల్లా చేజర్ల మండలం తిరుపతి నాయుడుపల్లి గ్రామంలో ప్రియుని ఇంటి ఎదుట బైఠాయించి మౌనదీక్ష చేపట్టింది ఓ యువతి.
వివరాల్లోకి వెళితే...
కర్నూలు జిల్లాకు చెందిన రేష్మ అనే యువతి నెల్లూరు జిల్లా శ్రీ సిటీలో సెల్ ఫోన్ తయారీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అటువంటి సమయంలోనే నెల్లూరు జిల్లా చేజర్ల మండలం తిరుపతి నాయుడుపల్లి గ్రామానికి చెందిన హనుమయ్య అనే యువకుడితో ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఫేస్బుక్ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా కలుసుకుని... ఆ యువకుడు ఇప్పుడు ముఖం చాటేసి తనను మోసం చేశాడని ఆ యువతి తెలిపింది. తనకు న్యాయం చేయాలంటూ...యువకుడి ఇంటి ఎదుట కూర్చొని మౌనదీక్ష చేపట్టింది.