ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 15, 2019, 8:32 AM IST

ETV Bharat / state

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేస్తారా.. లేక దూకేయమంటారా..?

తాను ప్రేమించిన వ్యక్తికి ఇంతకు ముందే పెళ్లి అయ్యింది... అయినా ఫర్వాలేదు నన్ను అతనికిచ్చే పెళ్లి చేయండి లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ హంగామా చేసింది ఓ యువతి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన ఘటన వివరాలివి..!

పెళ్లి చేస్తారా? దూకమంటారా?

తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయాలంటూ యువతి హల్​చల్​
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఓ యువతి వాటర్ ట్యాంకు ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. తాను ప్రేమించిన వ్యక్తికి పెళ్లి అయినా అతనితోనే వివాహం చేయించాలంటూ హడావుడి చేసింది. నెల్లూరు జిల్లా కపాటిపాలేనికి చెందిన ఓ యువతి పాలిటెక్నిక్ కళాశాలలో అటెండర్​గా విధులు నిర్వహిస్తున్న సింధూర్ అనే యువకుడితో ప్రేమలో పడింది. సింధూర్​కు పెళ్లి అయినా తననతోనే వివాహం చేయాలంటూ వాటర్ ట్యాంకు ఎక్కి చనిపోతానంటూ బెదిరించింది. తాను ప్రేమించిన యువకుడితో వివాహం జరిపించాలని పట్టుబట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, యువతిని కిందికు దింపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పోలీసులు నచ్చచెప్పినా ఆమె పట్టు వీడలేదు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details