ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇళ్ల స్థలాలు ఇస్తామని.. ఉన్న గుడిసెలు ఖాళీ చేయించారు... - nellore jilla lo illa stalalu istamani vunna stalalu kali cheyincharani girijanula aaropana

నెల్లూరు జిల్లా పమిడిపాడు దగ్గర నివాసముంటున్న కొన్ని గిరిజన కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని గుడిసెలు ఖాళీ చేయించి అధికారులు మోసం చేశారని వాపోతున్నారు. కనీస వసతులు లేక ఇబ్బందులు పడున్నామని.. వెంటనే అధికారులు స్పందించి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

house plots not alloted
ఇళ్ల స్థలాలు ఇస్తామని అధికారులు మోసంచేశారు

By

Published : Jan 4, 2021, 5:34 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పమిడిపాడు వద్ద గత 12 సంవత్సరాల నుండి 31 గిరిజన కుటుంబాలు గుడిసెలు వేసుకుని జీవనం‌ సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా గుడిసెల్లో నివసిస్తున్న వారిని అధికారులు ఖాళీ చేయించారు‌. మెుదటి ప్రాముఖ్యతగా అదే స్థలంలో.. ఖాళీ చేసిన గిరిజనులందరికీ పట్టాలు మంజూరు చేస్తామని అధికారులు నమ్మబలికారు. లేఔట్​లు వేసి 723 మంది లబ్దిదారులకు వాటిని కేటాయించారు కానీ.. ఇప్పుడు అక్కడ గిరిజనులకు ఇస్తామన్న స్థలాలను కేటాయించకుండా ప్రభుత్వం తమను మోసం చేసిందని ఆరోపిస్తున్నారు.

గిరిజన కుటుంబాలను ఖాళీ చేయించిన స్థలాలను సంపన్నులకు కేటాయించారని వారు ఆవేదవ వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్ అందుబాటులో లేక పోవడంతో గిరిజన వృద్ధులకు పింఛన్లు, ఇతర ప్రభుత్వం పథకాలు అందడం లేదంటున్నారు. కనీస సౌకర్యాలైన తాగునీరు, విద్యుత్ లేక ఇబ్బందిపడుతున్నామని వాపోయారు. నివసిస్తున్న స్థలం నుంచి పోరంబోకు స్థలాలకు తమ నివాసాలకు తరలించడం వల్ల రాత్రయితే పాముల బెడదతో భయం గుప్పిట్లో జీవిస్తున్నామని.. అధికారులు వెంటనే స్పందించి తమను ఖాళీ చేయించిన చోటే ఇళ్ల స్థలాలు కేటాయించి స్యాయం చేయాలని గిరిజన కుటుంబాలు కోరుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details