GENCO: ప్రభుత్వరంగ సంస్థ జెన్‌కో ఆధ్వర్యంలో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నేలటూరులో నిర్వహిస్తున్న శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్ కేంద్రాన్ని ప్రైవేటుపరం చేస్తే ఒప్పుకోబోమని జెన్‌కో పరిరక్షణ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఒప్పంద కార్మికులు, ఉద్యోగులు చేస్తున్న నిరసన శనివారం 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రాజెక్టు వెలుపల రోడ్డుపై వారు ప్రదర్శన నిర్వహించారు. వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమం ప్రారంభమైనప్పటినుంచి వివిధ కార్మిక సంఘాల నాయకులు, పార్టీల ప్రతినిధుల ఆధ్వర్యంలో పలుసార్లు ఆందోళనలు చేపడుతున్నారు.
GENCO: జెన్‌కో పరిరక్షణ ఉద్యమం @ 100 రోజులు - నెల్లూరు జిల్లా తాజా వార్తలు
GENCO: శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్ కేంద్రాన్ని ప్రైవేటుపరం చేస్తే ఒప్పుకోబోమని ఒప్పంద కార్మికులు, ఉద్యోగులు చేస్తున్న నిరసన శనివారంతో 100 రోజులు పూర్తైంది.
శనివారంతో 100 రోజులు పూర్తైన జెన్‌కో ఒప్పంద కార్మికులు, ఉద్యోగుల నిరసనలు