నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడు శ్రీనివాసపురం కాలనీకు చెందిన గ్రామ వాలంటీర్ పై దాడి జరిగింది. శ్రీనివాసపురం కాలనీకు చెందిన గ్రామ వాలంటీర్ గా పని చేస్తున్న జయకుమార్ పై అదే గ్రామానికి చెందిన జ్యోతి హజరత్తయ్య,కుటుంబ సభ్యులతో కలసి దాడి చేశారు. తనకు కావాల్సిన సమాచారం అడిగినందుకు సమాధానం చెప్పకుండా దాడి చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్రామంలో ఉన్న ఆస్తి తగదాల విషయాల్లో కలుగచేసుకోవద్దని దాడి చేశారని బాధితుడు ఆరోపించాడు. స్వల్ప గాయాలతో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు నుంచి ఫిర్యాదు సేకరించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మకూరులో వాలంటీర్ పై దాడి - కరటంపాడు
గ్రామంలో ఉన్న ఇళ్ల పై సమాచారం అడిగిన ఓ వాలంటీర్ పై నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఓ కుటుంబం దాడి చేసింది.సమాచారం అడిగినందుకు తనపై దాడికి దిగారని వాలంటీర్ చేసిన ఫిర్యాదు పై పోలీసులు విచారణ ప్రారంభించారు.
సమాచారం అడిగితే...దాడి చేశారు...