ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏఎస్ పేటలో ఘనంగా గంధ మహోత్సవం - nellore latest news

నెల్లూరు జిల్లా ఏఎస్ పేట గ్రామంలో శ్రీ హజరత్ ఖాజా నాయబ్ రసూల్ దర్గాలో 247వ గంధ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కొవిడ్ నేపథ్యంలో భక్తులను పరిమితి సంఖ్యలో అనుమతిచ్చారు.

gandha mahotsavam at nellore
ఏఎస్ పేటలో ఘనంగా గంధ మహోత్సవం

By

Published : Nov 13, 2020, 5:25 PM IST

నెల్లూరు జిల్లా ఏఎస్ పేట గ్రామంలో శ్రీ హజరత్ ఖాజా నాయబ్ రసూల్ దర్గాలో 247వ గంధ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో నిర్వాహకులు దర్గా వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొదట దర్గా పీఠాదిపతి హఫీజ్ బాషా ఇంట్లో గంధాన్ని దంచి బిందెలలో కలిపారు. అక్కనుంచి మెళతాళాలు, ఫకీర్ల విన్యాశాలతో దర్గాకు తీసుకొచ్చారు. ప్రత్యేక ప్రార్థలు చేసిన అనంతరం ఆ గంధాన్ని ఖాజానాయబ్ రసూల్ సమాదికి పట్టించారు. అనంతరం ఆ గంధాన్ని భక్తులను పంచిపేట్టారు.

అయితే కరోనా నేపథ్యంలో ఈ మహోత్సవానికి పరిమితి సంఖ్యలో భక్తులకు అనుమతిచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఎర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details