నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగలో భాగంగా గంధమహోత్సవం వైభవంగా జరిగింది. సాంప్రదాయబద్ధంగా జరిగే ప్రార్థనలకు కొద్ది మంది భక్తులను అనుమతిచ్చారు. కోటమిట్ట దగ్గరున్న చందనమహల్ నుంచి గంధాన్ని ఊరేగింపుగా దర్గాకు తీసుకువచ్చారు. కడప పీఠాధిపతి ఆరీఫుల్లా హుసేనీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
బారా షహీద్ దర్గాలో గంధ మహోత్సవం - Gandha festival at Barashaheed Dargah
నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగలో భాగంగా గంధమహోత్సవం వైభవంగా జరిగింది. కరోనా కారణంగా ఈ ఏడాది రొట్టెల పండుగను అధికారులు రద్దు చేశారు.
బారాషహీద్ దర్గాలో గంధమహోత్సవం
ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు హాజరై బారాషాహీద్లకు గంధాన్ని లేపనం చేశారు. కరోనా కారణంగా ఈ ఏడాది స్వర్ణాల చెరువులో ఇచ్చిపుచ్చుకునే కోర్కెల రొట్టెలను పూర్తిగా రద్దు చేశారు.
ఇవీ చదవండి: ధాన్యానికి మద్దతు ధర కల్పించాలంటూ రైతు సంఘాల ధర్నా