తిరుపతి, నెల్లూరు, కావలి సహా పలు ప్రాంతాల్లో విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని గంజాయిని సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని నెల్లూరు జిల్లా కావలి పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ జిల్లాకు చెందిన అర్జున్ ...గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అతడిపై నిఘా పెట్టారు. తమిళనాడులోని అరకు వ్యాలీలో డిగ్రీ చదువుతున్న అర్జున్... కావలికి గంజాయి తీసుకుని వస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
విద్యార్థులే లక్ష్యంగా గంజాయి సరఫరా... యువకుడు అరెస్ట్ - గంజాయి సరఫరా చేస్తూ విశాఖ వాసి అరెస్ట్
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని గంజాయిని సరఫరా చేస్తున్న యువకుడిని నెల్లూరు జిల్లా కావలి పోలీసులు అరెస్టు చేశారు.

విద్యార్థులే లక్ష్యంగా గంజాయి సరఫరా... అరెస్ట్
విద్యార్థులే లక్ష్యంగా గంజాయి సరఫరా... అరెస్ట్