ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విడుదల కాని నిధులు.. నిలిచిపోయిన ఆధునీకరణ పనులు

Sarvepalli Reservoir: నెల్లూరు జిల్లా సర్వేపల్లి జలాశయం ఐదు మండలాల రైతులకు ప్రాణప్రదమైనది. వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తుంది. 70 ఏళ్ళకు పూర్వమే నిర్మించిన రిజర్వాయర్. ఎంతో ప్రాధాన్యత కలిగిన జలాశయాన్ని నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తున్నారు. మూడు మండలాల ప్రజలకు రహాదారిగా కూడా ఉంది. 30 గ్రామాల ప్రజలు జలాశయం కట్టమీదుగా రాకపోకలు చేస్తుంటారు. రెండేళ్ళ కిందట ఆధునికీకరణకు 11 కోట్లు కేటాయించారు. నిధులు మంజూరు సరిగా లేకపోవడంతో గుత్తేదారు కూడా పనులు నిలిపివేశాడు.

బలహీనంగా మారిన సర్వేపల్లి జలాశయం
బలహీనంగా మారిన సర్వేపల్లి జలాశయం

By

Published : Mar 24, 2023, 8:23 PM IST

విడుదల కాని నిధులు.. నిలిచిపోయిన ఆధునీకరణ పనులు

Sarvepalli Reservoir : బలహీనంగా మారిన సర్వేపల్లి జలాశయం.. నిధుల కొరతతో ఏడాదిగా పనులు నిలిచిపోయాయి. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో పెద్ద జలాశయం. రెండు టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. 20 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇంత ప్రధానమైన జలాశయం ఆధునికీకరణకు ఐదేళ్ల కిందట ప్రతిపాదనలు పెట్టారు. రెండేళ్ల కిందట ప్రభాకర్ రెడ్డి గుత్తేదారుకు పనులు అప్పగించారు. నిధులు విడుదలలో జాప్యం జరగడంతో ఏడాది నుంచి ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.

మొక్కుబడిగా పనులు :జలాశయంలో కొంత భాగంగా ఆధునికీకరణకు రూ.11 కోట్లు కేటాయించారు. గుత్తేదారు ఐదు కోట్లు పనులు చేశారని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. చేసిన పనులను చూస్తే డొల్లగా ఉన్నాయి. పది అడుగులో ఒకేసారి మట్టిపోసి రోలింగ్ చేశారు. మొక్కుబడిగా రోలింగ్ చేయడంతో కట్టలు భారీగా కోతకు గురయ్యాయి.

భయాందోళనలో రైతులు :4500 ఎకరాల విస్తీర్ణంలో జలాశయం విస్తరించి ఉంటుంది. 2021లో పనులు ప్రారంభించారు. ఐదు నెలలు మాత్రమే పనులు చేశారు. ఏడాదిలోపు పనులు పూర్తి చేయాలి. ఐదు కోట్ల రూపాయలు పనులు చేస్తే ఇరిగేషన్ శాఖ నుంచి రెండు కోట్లు మాత్రమే బిల్లులు ఇచ్చారని కొందరు తెలిపారు. దీంతో గత ఏడాది నుంచి ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. మళ్లీ వర్షాలు వచ్చి జలాశయంలోకి నీరు చేరితే పనులు చేయడం కష్టం అవుతుంది. చేసిన పనులు కొట్టుకుపోయే పరిస్థితి ఉందని, రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇరిగేషన్ శాఖ అధికారులు పర్యవేక్షణ :పాత కట్టను తవ్వి కొత్త మట్టిని పోయాలి. గుత్తేదారు చెరువులోని మట్టిని తవ్వి మొక్కుబడిగా చదును చేశారు. జలాశయం కట్ట అనేకచోట్ల ఎక్కువ లోతులో గుంతలు ఏర్పడ్డాయి. భారీ వర్షాలు వస్తే కట్టలు కోసుకుపోయే ప్రమాదం ఉంది. ఇరిగేషన్ శాఖ అధికారులు పర్యవేక్షణ లేదని స్థానికులు అంటున్నారు.

వరద ప్రవాహం పొలాల మీద పడే ప్రమాదం :ప్రభుత్వం రెండేళ్లుగా జలాశయం పనులకు నిధులు సక్రమంగా విడుదల చేయకపోవడంతో ఆధునికీకరణ పనులు నిలిచిపోయాయి. ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు డొల్లగా చేసిన పనులను పరిశీలించాల్సిన అవసరం ఉంది. కోసుకుపోయిన కట్టను గుత్తేదారు చేత వేగంగా చేయాల్సి ఉందని, లేకుంటే రానున్న వర్షాలకు కట్టలు దెబ్బతింటే వరద ప్రవాహం పొలాల మీదకు పడే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జలాశయం కట్టపై రాకపోకలు :సర్వేపల్లి జలాశయం కట్ట మీదుగా సర్వేపల్లి, నెల్లూరు, ముత్తుకూరు, వెంకటాచలం మండలాలకు ప్రజలు రాకపోకలు చేస్తుంటారు. కట్టసరిగా లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details