ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సర్వేపల్లి రిజర్వాయర్ ఆధునీకీకరణకు నిధులు విడుదల - సర్వేపల్లి రిజర్వాయర్ ఆధునీకరణకు నిధులు విడుదల

నెల్లూరు జిల్లా సర్వేపల్లి రిజర్వాయర్ ఆధునీకీకరణ పనుల కోసం ప్రభుత్వం 11 కోట్ల 34 లక్షల రూపాయలు విడుదల చేసిందని నీటిపారుదల శాఖ సెంట్రల్ డివిజన్ ఈఈ కృష్ణమోహన్ తెలిపారు. నిధులు విడుదల కావటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

nellore  district
సర్వేపల్లి రిజర్వాయర్ ఆధునీకరణకు నిధులు విడుదల

By

Published : Jul 4, 2020, 8:27 PM IST

నెల్లూరు జిల్లా సర్వేపల్లి రిజర్వాయర్ ఆధునీకీకరణ పనులకు ప్రభుత్వం రూ.11 కోట్ల 34 లక్షలు కేటాయించిందని నీటిపారుదల శాఖ సెంట్రల్ డివిజన్ ఈఈ కృష్ణమోహన్ తెలిపారు. ఎనిమిది సంవత్సరాల నుంచి సర్వేపల్లి రిజర్వాయర్ కట్ట పరిస్థితి బాగా లేకపోవటంతో ప్రభుత్వానికి అధికారులు నివేదిక పంపారని చెప్పారు. ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసిందని పేర్కొన్నారు.

రబీ పంట పూర్తయిన వెంటనే ఫిబ్రవరి, మార్చిలో పనులు మొదలు పెడతామని ఈఈ కృష్ణమోహన్ తెలిపారు. ఈ నిధులతో అన్ని పనులు సంపూర్ణంగా చేస్తామన్నారు. సర్వేపల్లి రిజర్వాయర్​కు నిధులు విడుదల కావటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి కృషితో నిధులు విడుదలయ్యాయని వివరించారు.


ఇది చదవండిరబీ విత్తనాలు సకాలంలో అందించేందుకు అధికారుల చర్యలు

ABOUT THE AUTHOR

...view details