ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మేకలతో వానరం దోస్త్​ మేరా దోస్త్​ - జొన్నవాడలో కోతి, మేకలు స్నేహితులు

ఆ స్నేహితులంటే ఆ ఊళ్లో అందరికీ ఇష్టం. ఎప్పుడు కనిపించినా అంతా ఆసక్తిగా చూస్తుంటారు. ఆ మిత్రులు చేసే సందడికి ముచ్చట పడతారు. అంత అన్యోన్యమైన స్నేహం వ్యక్తుల మధ్య కాదండోయ్​... ఇది ఓ కోతి, 10 మేకల దోస్తీ కథ. మనుషులను ఆకట్టుకుంటోన్న మూగ జీవుల స్నేహం కథ. ఈ నేస్తాల గురించి తెలుసుకోవాలంటే నెల్లూరు జిల్లా జొన్నవాడ గ్రామానికి వెళ్లాల్సిందే..!

మేకలతో వానరం దోస్తీ

By

Published : Nov 6, 2019, 10:58 PM IST

Updated : Nov 6, 2019, 11:12 PM IST

మేకలతో వానరం దోస్తీ... అందరికీ ఆసక్తి

నెల్లూరు జిల్లా జొన్నవాడ గ్రామానికి చెందిన శ్రీలక్ష్మి మేకలతో పాటు కోతిని పెంచుతున్నారు. ఐదేళ్ల కిందట శ్రీలక్ష్మి ఇంటికి వచ్చిన కోతి వారితోనే ఉండిపోయింది. కొద్ది రోజుల్లోనే ఆ వానరానికి మేకలతో మంచి దోస్తీ కుదిరింది. మేకలు కూడా కోతిని అమితంగా ఇష్టపడేవి. ఇక అప్పటి నుంచి ఆ వానరం, మేకలు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ సందడి చేస్తున్నాయి. మేకల మీద ఎక్కి కోతి స్వారీ చేస్తోంది. మేకలు కూడా వానరాన్ని వీపున ఎక్కించుకుని షికార్లు చేస్తున్నాయి.

పిల్లకోతితో మరింత అల్లరి

శ్రీలక్ష్మి రోజూ మేకలను పొలాల్లోకి తోలుకుని వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వస్తుంది. మేకలతోపాటే కోతి కూడా వెళ్తుంది. ఓ పక్క చెట్లపై కోతి వేషాలేస్తూనే మేకలను ఓ కంట కనిపెడుతూ కాపలాగా తిరుగుతుంది. ఇటీవలే పుట్టిన తన పిల్లకోతితో కలసి మరింత అల్లరి చేస్తోంది ఈ తల్లి వానరం. యజమాని శ్రీలక్ష్మి వెళ్లకపోయినా ఆ మేకల మందను ఈ కోతి పొలానికి తీసుకెళ్లి భద్రంగా తిరిగి ఇంటికి తీసుకొస్తుందట. కోతి, మేకల స్నేహాన్ని ఆ ఊరివారు గొప్పగా చెప్పుకుంటుంటారు.

ఇదీ చూడండి

Last Updated : Nov 6, 2019, 11:12 PM IST

ABOUT THE AUTHOR

...view details