నెల్లూరు జిల్లా అనంతసాగరానికి చెందిన షేక్ ఖాజావలికి ప్రాణాంతక బోన్ మ్యారో వ్యాధి సోకింది. సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించే అతనికి వైద్యం కోసం రూ.25 లక్షలు అవసమయ్యాయి. కుటుంబ పరిస్థితులు అంతంతమాత్రంగా ఉండడం వల్ల ఆ డబ్బు అతనికి, కుటుంబ సభ్యులకు శక్తికి మించినదే అయ్యింది. అయితే షేక్వలీకి మేమున్నామంటూ అతని స్నేహితులు అండగా నిలిచారు. వైద్యానికయ్యే డబ్బు కోసం ఊరూరా తిరిగి భిక్షాటన చేస్తున్నారు. ఎవరైనా దాతలు స్పందించి తమ స్నేహితుణ్ని కాపాడాలంటూ అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం ఖాజావలి తమిళనాడులోని వేలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఖాజావలి కోసం స్నేహితులు పడుతోన్న తపనను చూసి పలువురు కన్నీటి పర్యంతమవుతూ... వారికి తోచిన సాయాన్ని అందిస్తున్నారు.
స్నేహితుడి ప్రాణమే ముఖ్యం... భిక్షాటన చేసేందుకూ వెనుకాడం...!
తల్లి.. తండ్రి.. సోదరుడు.. ఇలా అన్ని బంధాలను దేవుడు నిర్ణయిస్తే స్నేహం అనే బంధాన్ని మనకు మనమే నిర్ణయించుకుంటాం. మంచి స్నేహితుణ్ని సంపాదించిన ఏ వ్యక్తి అయినా అదృష్టవంతుడే. తమ స్నేహితుణ్ని ప్రాణాంతక వ్యాధి కబలిస్తోందని తెలిసి ఆ యువకులు మథనపడ్డారు. తామున్నామంటూ ధైర్యం చెప్పి... వైద్యానికి అవసరమయ్యే ధనం కోసం ఊరూరా తిరిగి భిక్షాటన చేస్తున్నారు. ఆ యువకుడు, స్నేహితుల గురించి తెలుసుకోవాలంటే నెల్లూరు జిల్లా అనంతసాగరానికి వెళ్లాల్సిందే...!
friends