నెల్లూరు జిల్లా ముత్తుకూరు కృష్ణపట్నం పోర్టులోకి వెళ్లే సరుకు రవాణా వాహనాలను నిలిపి వేస్తున్నారంటూ వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయంలో యూనియన్ల మధ్య వివాదం కొనసాగుతోంది. వీటిలో ఓ యూనియన్‌కి అధికార పార్టీ అండ ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. పోర్టులోకి వెళ్లే రవాణా వాహనాలను అడ్డుకుంటున్నారని.... వెంకటాచలం మీదుగా కృష్ణపట్నం పోర్టులోకి వెళ్తున్న లారీలకు గతం కన్న ఎక్కువ టోలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. 15 రోజులుగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని బాధితులు వాపోయారు.
యూనియన్ల మధ్య పోరు.. నిలిపి వేస్తున్న వాహనాలు... - krishnapatnam port news
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులోకి వెళ్లే సరుకు రవాణా వాహనాలను నిలిపివేస్తున్నారని వాహనదారులు వాపోయారు. 15 రోజులుగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
వాహనాలు నిలిపివేత