ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పోషకాహారంతో మెండుగా వ్యాధి నిరోధక శక్తి' - ఈటీవీ భారత్​ తెలుగు తాజా వార్తలు

నెల్లూరులోని బోడిగాడితోట శ్మశానవాటిక వద్ద ఉండే 500 మంది నిరుపేద పిల్లలకు గంగాధర్​ చారిటబుల్​ ట్రస్ట్​ ... పోషకాహారాన్ని పంపిణీ చేసింది.

free food distribution for 500 poor people at nellore district
నిరుపేద పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ

By

Published : May 31, 2020, 10:57 PM IST

నెల్లూరులోని గంగాధర్​ చారిటబుల్​ ట్రస్ట్..​ లాక్​డౌన్​ కాలంలో తమ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. నగరంలోని బోడిగాడితోట స్మశానవాటిక దగ్గర నివాసముండే 500 మంది నిరుపేద పిల్లలకు పౌష్టికాహారం అందజేశారు. పోషకాహారం ద్వారా వ్యాధినిరోధక శక్తి పెంపొందుతుందన్న ఉద్దేశ్యంతో ఈ సహాయం చేస్తున్నట్టు చెప్పారు.

లాక్​డౌన్​ ప్రారంభం అయినప్పటి నుంచీ పిల్లలకు ఆహారాన్ని ఇస్తున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం లాక్​డౌన్​ను జూన్​ నెలాఖరు వరకు పొడిగించినందున ...దాతల సహకారంతో తమ సేవా కార్యక్రమాలు ఇంకా కొనసాగిస్తామని ట్రస్ట్​ వ్యవస్థాపకులు గంగాధర్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details