వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఎడగారులో పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించాలంటూ నెల్లూరు నగరంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతు నాయకులు ధర్నా చేపట్టారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ధాన్యానికి మద్దతు ధర కల్పించాలంటూ రైతు సంఘాల ధర్నా - framers protest in nellore district news
ఎడగారులో పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించాలంటూ నెల్లూరు నగరంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతు నాయకులు ధర్నా చేపట్టారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
framers protest
రైతులను మిల్లర్లు భారీ ఎత్తున మోసం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరుగు పేరుతో 100 కిలోల వరకు దాన్యం మిల్లర్లు తీసుకుంటున్నారని రైతు నాయకులు మండి పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులపై దృష్టి సాధించాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున రైతులకు నష్టం జరుగుతుందన్నారు.
ఇదీచదవండి :గొప్ప మేధావిని దేశం కోల్పోయింది: మోదీ