ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దళారుల దందా నుంచి కాపాడండి' - నెల్లూరు జిల్లా గంగవరంలో ఆర్బీకే వద్ద రైతుల ఆందోళన వార్తలు

నెల్లూరు జిల్లా కోవూరు మండలం గంగవరం గ్రామంలో.. రైతు భరోసా కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. దళారులు తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

framers protest at rbk in gangavaram at nellore
గంగవరంలో ఆర్బీకే వద్ద రైతుల ఆందోళన

By

Published : Mar 20, 2021, 6:03 PM IST

గంగవరంలో ఆర్బీకే వద్ద రైతుల ఆందోళన

నెల్లూరు జిల్లా కోవూరు మండలం గంగవరంలో రైతు భరోసా కేంద్రానికి రైతులు తాళం వేశారు. దళారులు మద్దతు ధరకు ధాన్యం కొనకపోయినా.. అధికారులు పట్టించుకోవడం లేదని, అలాంటప్పుడు రైతు భరోసా కేంద్రం ఎందుకని ప్రశ్నిచారు.

ఆర్బీకే అధికారి శ్వేత.. పంచాయతీ కార్యాలయం వద్ద ఉందని తెలుసుకున్న రైతులు అక్కడకు వెళ్లి ఆందోళన చేశారు. ధాన్యానికి 17శాతం తేమ ఉండేలా ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని, వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details