నెల్లూరులో నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం జోరుగా వర్షం కురిసినా లెక్క చేయకుండా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. డివిజన్ పరిధిలో 236 సర్పంచ్ స్థానాలకు గాను 55 ఏకగ్రీవం కాగా, 181 పంచాయతీల్లో 475 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. 2,337 వార్డు మెంబర్ స్థానాలకు గాను 810 ఏకగ్రీవం కాగా, 1527 స్థానాల్లో 3,303 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 4.42 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు - నెల్లూరు జిల్లా తాజా వార్తలు
నెల్లూరు జిల్లాలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నెల్లూరు డివిజన్లోని 12 మండలాల్లో 181 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 471 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇప్పటివరకు 10 శాతం ఓటింగ్ నమోదైంది.
నెల్లూరులో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు