నెల్లూరు జిల్లా సంగం వెంగారెడ్డి పాళెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి నెల్లూరు వైపు వస్తున్న కారు.. పొలం పనులు ముగించుకుని వస్తున్న రైతు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు కాగా.. కారులో అక్రమంగా తరలిస్తున్న 32 మద్యం బాటిళ్లను స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు...అక్కడికి చేరుకుని మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. రాష్ట్రంలో మద్యం అధిక ధరలు ఉండడం వల్ల.. పక్క రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా తీసుకువస్తున్నారు.
బైక్‌ను ఢీకొన్న కారు..ప్రమాదంలో బయటపడ్డ మద్యం బాటిళ్లు - నెల్లూరు జిల్లాలో మద్యం అక్రమ రవాణా తాజా వార్తలు
కారులో సైలెంట్‌గా మద్యం అక్రమ రవాణా చేస్తున్న వారి గుట్టు ప్రమాదం కారణంగా బట్టబయలైంది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొన్న ఘటనలో నలుగురు గాయపడ్డారు.తీరా స్థానికులు గమనించగా కారులో మద్యం బాటిళ్లు బయటపడ్డాయి.
బైక్‌ను ఢీకొన్న కారు