ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Death: ప్రమాదవశాత్తు చెరువులో పడి నలుగురు మృతి - రాజుపాలెంలో చెరువులో పడి నలుగురు మృతి వార్తలు

four died falling in pond
ప్రమాదవశాత్తు చెరువులో పడి నలుగురు మృతి

By

Published : Jun 7, 2021, 8:48 PM IST

Updated : Jun 7, 2021, 9:39 PM IST

20:45 June 07

రాజుపాలెంలో విషాదఛాయలు

నెల్లూరు జిల్లా ఓజిలి మండలం రాజుపాలెంలో తీవ్ర విషాదం నెలకొంది. సమీపంలోని చెరువు వద్ద ఆడుకునేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు.. ప్రమాదవశాత్తు నీటమునిగి మరణించారు. వారిని కాపాడేందుకు వెళ్లిన మరో వ్యక్తి కూడా మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. విచారణ జరుపుతున్నారు.   పిల్లలు మాచవరం హేమంత్(6), మాచవరం చరణ్ తేజ(8), జాహ్నవి(12) చెరువు వద్దకు ఆడుకునేందుకు వెళ్లి నీటమునిగారు. బతుకుదెరువు కోసం వీరి కుటుంబాలు రాజుపాలెం హైవే దుకాణాలు నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాయి. చిన్నారులను కాపాడే క్రమంలో.. ఖలీల్ (45) అనే వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. నలుగురి మృతితో రాజుపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 


ఇదీ చదవండి:ఇరువర్గాల మధ్య ఘర్షణ... కానిస్టేబుల్​కు తీవ్ర గాయాలు

Last Updated : Jun 7, 2021, 9:39 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details