కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న నాలుగు టిప్పర్లను నెల్లూరు జిల్లా కొడవలూరు పోలీసులు పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్దంగా అధిక లోడుతో జాతీయ రహదారిపై వెళ్తున్న గ్రావెల్ టిప్పర్లను కొడవలూరు ఎస్.ఐ. సుబ్బారావు పట్టుకుని, స్టేషన్ కు తరలించారు.
గత కొంత కాలంగా మండలంలోని పలు ప్రాంతాల నుంచి గ్రావెల్ అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం పట్టుబడ్డ గ్రావెల్ టిప్పర్లను వదిలేయాలంటూ అధికారపార్టీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.