Formula E Racing: హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రారంభమైంది. స్ట్రీట్ సర్క్యూట్‌పై స్పోర్ట్స్ కార్లు రయ్.. రయ్ మంటూ పరుగులు తీశాయి. రేసింగ్‌కి ముందు ట్రయల్ రన్ నిర్వహించారు. క్వాలిఫైయింగ్ 1, 2 తర్వాత రేస్ 1 స్పిన్ట్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 3.10 గంటల నుంచి 3.20 గంటల వరకు క్వాలిఫయింగ్-1 డ్రైవర్ ఏ బృందం, 3.30 నుంచి 3.40 నిమిషాల వరకు క్వాలిఫయింగ్-2 బి బృందం రేస్ ప్రారంభించింది. సాయంత్రం 4 గంటల నుంచి 4.45 గంటల వరకు మెయిన్ రేస్ జరిగింది.
2023 ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా ఈ-కార్ రేస్ ప్రిపరేషన్‌లో భాగంగా ఇవాళ, రేపు ఇండియన్ రేసింగ్ నిర్వహిస్తున్నారు. ఇవాళ పెట్రోల్ కార్లతోనే రేస్ నిర్వహించారు. ఈ రేసింగ్‌లో 12 కార్లు, 6 బృందాలు, నలుగురు డ్రైవర్లు, మహిళా రేసర్లు పాల్గొన్నారు. 50శాతం దేశంలోని రేసర్లు, మరో 50శాతం విదేశీ రేసర్లు ఇండియన్ రేసింగ్ లీగ్‌లో పాల్గొన్నారు. పెట్రోల్ కార్లు 240కి.మీ స్పీడ్‌తో వెళ్లాయని, ఎలక్ట్రిక్ కార్లయితే గరిష్ఠ వేగం 320 కి.మీ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
తరలి వచ్చిన అభిమానులు:రేసింగ్‌ను వీక్షించడానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. నిర్వాహకులు కూడా ప్రేక్షకుల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మొత్తం 7,500 టికెట్లు అమ్ముడుపోయాయని నిర్వాహకులు తెలిపారు. ఈ రేసింగ్‌లో మొత్తం 18 మూలమలుపులు ఉన్నాయి. ప్రతి మూలమలుపు వద్ద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి ప్రమాదం జరిగిన వెంటనే చికిత్స అందించడానికి, ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా అంబులెన్స్‌ను కూడా సిద్ధంగా ఉంచారు. మంత్రి కేటీఆర్ ఐమాక్స్ వద్ద ప్రేక్షకులతో పాటు నిల్చుని రేసింగ్‌ను వీక్షించారు. హైదరాబాద్, బెంగళూరు, గోవా, చెన్నై, కొచ్చి బృందాలు రేసింగ్‌లో పాల్గొన్నాయి.