ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Venkaiah Naidu Aathmeeya Samavesham: సొంత డబ్బు ఖర్చు పెట్టి ప్రజలే గెలిపించారు.. : వెంకయ్యనాయుడు

Venkaiah Naidu Aathmeeya Samavesham: నెల్లూరు జిల్లాలోని దుత్తలూరులో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తాను ఉదయగిరి నియోజకవర్గం నుంచి శాసనసభ ఎన్నికలకు పోటీ చేసినప్పుడు ప్రజలే సొంత డబ్బు పెట్టి గెలిపించారని అన్నారు. ఇంకా ఏమన్నారంటే..?

Etv Bharat
Etv Bharat

By

Published : Jun 12, 2023, 10:45 AM IST

Updated : Jun 12, 2023, 2:17 PM IST

సొంత డబ్బు ఖర్చు పెట్టి ప్రజలే గెలిపించారు.. : వెంకయ్యనాయుడు

Former Vice President Venkaiah Naidu Aathmeeya Samavesham: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రజలు తనపై చూపిన అభిమానానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. దుత్తలూరులో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వెంకయ్య నాయుడు దంపతులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు, మాజీ జడ్పీ చైర్మన్ చెంచలబాబు యాదవ్​ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన వెంకయ్యనాయుడికి ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఆయనను గజమాలతో సత్కరించారు.

అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ఉదయగిరి నియోజక వర్గానికి, తనకూ ఎంతో అనుబంధం ఉందని ఆయన అన్నారు. ఆ ప్రాంత ప్రజలు తనను దిల్లీ స్థాయికి తీసుకుని వెళ్లారని ఆయన అన్నారు. పైసా ఖర్చు లేకుండా ఉదయగిరి ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించారని ఆయన అన్నారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు డబ్బు పంచే సంస్కృతి లేదని ఆయన తెలిపారు. పైగా ప్రజలే తిరిగి తనకు ఎన్నికల ఖర్చు కోసం డబ్బులిచ్చారని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని ఆయన అన్నారు. ఉదయగిరి నుంచి ఉపరాష్ట్రపతి వరకు వివిధ పదవులలో పనిచేసేందుకు అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఉదయగిరి ప్రజలు మేలు మరువలేనిదని, అక్కడి ప్రజలకు తన కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

అనంతరం నర్రవాడలోని ఓ కల్యాణ మండపంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని పూర్వ రాజకీయ మిత్రులు శ్రేయభిలాషులు, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు బ్రహ్మోత్సవాల్లో నర్రవాడ శ్రీ వెంగమాంబ అమ్మవారిని.. సతీమణితో కలిసి వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. పలువురు తెలుగుదేశం, వైసీపీ నేతలు సైతం అమ్మవారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

"పైసా ఖర్చు లేకుండా ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు డబ్బు పంచే సంస్కృతి లేదు. పైగా ప్రజలే తిరిగి ఎన్నికల ఖర్చు కోసం డబ్బులిచ్చారు. ప్రస్తుత రాజకీయాలు అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ఉదయగిరి నుంచి ఉపరాష్ట్రపతి వరకు వివిధ పదవులలో పనిచేసేందుకు అవకాశం లభించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఉదయగిరి ప్రజలు చేసిన మేలు ఎన్నటికీ మరువలేనిది. నాపై ఆదరాభిమానాలు చూపిన ప్రజలకు నా కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుంది." - వెంకయ్య నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి

ఇవీ చదవండి:

Last Updated : Jun 12, 2023, 2:17 PM IST

ABOUT THE AUTHOR

...view details