ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేంద్ర ప్రభుత్వానిది ప్రజా వ్యతిరేక పాలన: చింతా మోహన్ - Dr.chinta mohan

కేంద్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. వెంకటగిరిలో కాంగ్రెస్ నేతలతో జరిగిన ఇష్టాగోష్టిలో ఆయన మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వంపై మాజీ కేంద్ర మంత్రి విమర్శలు

By

Published : Jul 19, 2019, 4:26 PM IST

కేంద్ర ప్రభుత్వంపై మాజీ కేంద్ర మంత్రి విమర్శలు

కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అవస్థలు పడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు.నెల్లూరులోని వెంకటగిరిలో నిర్వహించిన ఇష్టాగోష్టి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమానికి కేంద్రం సరిపడా నిధులివ్వకుండా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలోని మన్నవరం పరిశ్రమ, శ్రీకాళహస్తి రైల్వే లైను, దుగరాజపట్నం ఓడరేవుల పట్ల కేంద్ర ప్రభుత్వం మొండివైఖరి వీడాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details