Somireddy Chandramohan Reddy : నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 28, 29, 30 తేదీల్లో నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నెల 28న కందుకూరు, 29వ తేదీన కావలి, 30వ తేదీల్లో కోవూరులో పర్యటించనున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి తెలిపారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే నినాదం ప్రజలలోకి వెళ్లిపోయిందని ఆయన అన్నారు. కందుకూరులో చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను టీడీపీ నేతలు పరిశీలించారు. ఈ పరిశీలనలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కొండేపి ఎమ్మెల్యే డీబీవీ స్వామి, నియోజకవర్గాల ఇంఛార్జ్లు పాల్గొన్నారు.
'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' నినాదం ప్రజల్లోకి వచ్చేసింది : సోమిరెడ్డి - నెల్లూరు జిల్లాలో చంద్రబాబు
Somireddy Chandramohan Reddy : ఈ నెల 28 నుంచి 30 వరకు చంద్రబాబు నెల్లూరులో పర్యటించనున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా నెల్లూరులో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
"మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు ఈ నెల 28న కందుకూరు, 29 కావలి, 30వ తేది కోవూరులో పర్యటించనున్నారు. అవకాశం ఉంటే 31 వ తేదీనా కోవూరులో ఉంటారు. నేడు రైతైనా, వ్యాపారస్తులైనా, కూలీ చేసుకునే వారు ఇలా ఎవరైనా సరే ఇదేం ఖర్మ అనుకునే పరిస్థితి వచ్చింది. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే నినాదం ప్రజలలోకి వెళ్లిపోయింది." - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రి
ఇవీ చదవండి:
Last Updated : Dec 27, 2022, 4:04 PM IST