ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆరోగ్యశాఖ మంత్రికి ధన్యవాదాలు : మాజీ మంత్రి సోమిరెడ్డి - ఆరోగ్యశాఖ మంత్రికి ధన్యవాదములు తెలిపిన మాజీ మంత్రి సోమిరెడ్డి

కరోనా కట్టడి కోసం సీఎం జగన్​కు రాసిన లేఖపై స్పందించిన.. ఆరోగ్యశాఖ మంత్రికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరులో కొవిడ్​ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న కారణంగా.. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కోరారు.

మాజీ మంత్రి సోమిరెడ్డి
Former minister Somireddy

By

Published : Apr 22, 2021, 11:34 AM IST

నెల్లూరులో కరోనా పరిస్థితులపై సీఎం జగన్​కు రాసిన లేఖకు.. ఆరోగ్యశాఖ మంత్రి స్పందించినందుకు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఒక్క నెల్లూరులోనే 40 శాతానికి పైగా కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కావడం వైరస్ వ్యాప్తి తీవ్రతకు అద్దంపడుతోందన్నారు. వెంటనే నెల్లూరులో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సోమిరెడ్డి కోరారు. ప్రమాదకర పరిస్థితుల నుంచి జిల్లాను కాపాడాలని విన్నవించారు. 13 జిల్లాల కంటే ఎక్కువగా నెల్లూరులోనే కరోనా కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు.

ABOUT THE AUTHOR

...view details