నెల్లూరు రూర్బన్లో చేపట్టిన పనుల్లో నాణ్యత లోపించిందని మాజీమంత్రి సోమిరెడ్డి ఆరోపించారు. ఈ పనుల్లో క్వాలిటీ కంట్రోల్, సోషల్ ఆడిట్ చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. ఉపాధి బిల్లులు చెల్లించకపోవడాన్ని వైకాపా ప్రభుత్వం గొప్పగా భావిస్తోందన్న ఆయన.. గుత్తేదారులు ఎవరూ అరకొర బిల్లులు తీసుకోవద్దని సూచించారు.
అక్కడి పనుల్లో నాణ్యత లోపించింది: మాజీమంత్రి సోమిరెడ్డి - మాజీమంత్రి సోమిరెడ్డి
నెల్లూరు రూర్బన్ పరిధిలో చేపట్టిన పనుల్లో నాణ్యత లోపించిందని.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీమంత్రి సోమిరెడ్డి డిమాండ్ చేశారు.
somi reddy