ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయి' - aikscc meeting at nellore

రాష్ట్రంలోని 18 లక్షల మంది రైతుల పొట్ట కొట్టేందుకు సీఎం జగన్​ కంకణం కట్టుకున్నారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. అలా చేస్తే దివంగత నేత రాజశేఖరరెడ్డి ఆత్మ శాంతించదని పేర్కొన్నారు. వెంటనే జీవో నంబరు 22ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

aikscc meeting at nellore
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయి

By

Published : Oct 19, 2020, 11:15 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబరు 22ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ ఆర్డినెన్సులను ఉపసంహరించుకోవాలన్నారు.

అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి ఆధ్వర్యంలో నెల్లూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతులకు ఎంతో మేలు చేశారని... ప్రస్తుత జగన్​ ప్రభుత్వం మాత్రం రైతుల పొట్ట కొట్టేందుకు కంకణం కట్టుకున్నట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details