నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురం అటవీ ప్రాంతంలో ముందస్తు సమాచారంతో ఫారెస్ట్ అధికారులు గాలింపు చేపట్టారు. వారికి అడవిలో ముగ్గురు వ్యక్తులు తారసపడ్డారు. తనిఖీ చేసి... నాటు తుపాకీ, కొండె గొర్రె మాంసాన్ని గుర్తించారు.
వాటిని స్వాధీనం చేసుకోని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వెంకటాపురం, కంపసముద్రం గ్రామాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ఆత్మకూరు అటవీ అధికారులు కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరుపరిచారు.