నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో నెల్లూరు పాళెం సమీపంలో అటవీశాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా.. వాహనంలో పుచ్చకాయల మాటున తరలిస్తున్న 30 ఎర్రచందనం దుంగల పట్టుబడ్డాయి. డ్రైవర్‌తో సహా మరొకరు పారిపోయారు.
ఎర్రచందనం అక్రమ రవాణా..30 దుంగలు స్వాధీనం - 30 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
అటవీశాఖ అధికారుల సోదాల్లో 30 ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో జరిగింది.
శనివారం తెల్లవారు జామున నెల్లూరు పాళెం చెక్ పోస్ట్ వద్ద అటవీశాఖ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా.. టాటా ఏస్ వాహనం వేగంగా రావటం గమనించిన అధికారులు ఆపడానికి ప్రయత్నించారు. వారు ఆపకుండా వెళ్లడంతో.. వెంబడించి పట్టుకున్నారు. ఆ వాహనాన్ని తనిఖీ చేయగా పుచ్చకాయల కింద 30 ఎర్ర చందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. వాటి సీజ్ చేసిన అధికారులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. వీటి విలువ రూ.2.50 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. వాహన యజమానిపై కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:ఆటో చక్రం తిరగక.. ఆగిన బతుకు చక్రం